Srikakulam District: ఏపీ ప్రజలు చంద్రబాబుకు రాజకీయ వీడ్కోలు పలికారు: కిల్లి కృపారాణి

  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది
  • చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు
  • వైసీపీని ఎంతగా ఆదరించారో మే 23న తెలుస్తుంది
ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా వాటన్నింటినీ అధిగమిస్తూ ఏపీలో ఎనభై శాతం పోలింగ్ జరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు రాజకీయ వీడ్కోలు పలికారన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని, ఈ విషయాన్ని ప్రజలు తమ ఓటు రూపంలో వ్యక్తం చేశారని చెప్పారు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర ప్రజలు వైసీపీని ఎంతగా ఆదరించారో అన్న విషయం తెలుస్తుందని అన్నారు.
Srikakulam District
YSRCP
killy
kruparani
Telugudesam

More Telugu News