Chandrababu: చంద్రబాబు అరుపులు, కేకలు పెద్దగా ఫలించినట్టులేవు: కేటీఆర్ సెటైర్లు

  • బాబు తన ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు
  • ఈసీ విఫలమైందని చెప్పాలని చూస్తున్నారు
  • బాబు, ఎల్లో మీడియా చేస్తున్న యత్నాలే నిదర్శనం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈవీఎంల పనితీరు సరిగా లేదన్న చంద్రబాబుపై  ఆయన విమర్శలు చేశారు. ఏపీలో జరిపిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అరుపులు, కేకలు, పెడబొబ్బలు పెద్దగా ఫలించినట్టు లేవని, అందుకే, తన ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారని విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని చెప్పాలని చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న యత్నాలే ఇందుకు నిదర్శనమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. 
Chandrababu
cm
Telugudesam
TRS
KTR
EC

More Telugu News