Chandrababu: ఒకవేళ చంద్రబాబు తనకు ఎదురుపడితే రామ్ గోపాల్ వర్మ ఇలా స్పందిస్తారట!

  • ఆయన నన్ను ఏమంటారో నాకు తెలియదు
  • నాకు ఆయన అంటే చాలా ఇష్టం
  • ఎందుకంటే, విలన్స్ అంటే నాకు ఇష్టం
‘ఒకవేళ చంద్రబాబునాయుడు మీకు ఎదురుపడితే ఎలా స్పందిస్తారు?’ అనే ప్రశ్నకు దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, ‘ఆయన నన్ను ఏమంటారో నాకు తెలియదు గానీ, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, విలన్స్ అంటే నాకు ఇష్టం, నేను తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఆయన పాత్ర విలన్’ అని అన్నారు.

'చంద్రబాబు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, మిగిలిన విషయాలు అలా ఉంచితే, ఈ సినిమాలో ఆయన పాత్ర విలన్' అని స్పష్టం చేశారు. చంద్రబాబు చూడమని చెప్పిన ‘మహానాయకుడు’ ఎవరూ చూడలేదు, చూడొద్దని చెప్పిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని అందరూ చూశారని ఓ ప్రశ్నకు బదులుగా వర్మ చెప్పారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి వర్మకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ గురించి ప్రస్తావించగా, ‘హర్ష అనే యాక్టర్ నాకు మెస్సెజ్ పెట్టాడు. ‘యు ఆర్  ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్’ అని’ చెప్పుకొచ్చారు.
Chandrababu
cm
Lakshmi`s Ntr
Ram gopal varma

More Telugu News