నంబూరు వెంకటేశ్వరస్వామి ఆలయానికి పవన్ కల్యాణ్ రూ.1.32 కోట్ల విరాళం
ఎన్నికలు ముగిసిన అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయానికి భారీ విరాళం ప్రకటించారు. రూ.1.32 కోట్ల విలువైన చెక్ ను ఆలయ ధర్మకర్తలకు స్వయంగా అందజేశారు. స్వామివారి నిత్యాన్నదాన పథకానికి తన విరాళాన్ని ఉపయోగించాల్సిందిగా ఆలయ వర్గాలను కోరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆలయంలో అన్నవితరణ జరుగుతుండగా భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు.
అంతకుముందు, జనసేన పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, అంజిబాబు తదితరులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించిన పవన్ కు దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తలు లింగమనేని పూర్ణభాస్కర్ రావు, వెంకటసూర్య రాజశేఖర్, రమేష్ ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఆలయంలోకి అడుగుపెట్టిన ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు కూడా సమర్పించారు.