Vijay Sai Reddy: జనసేన లక్ష్మీనారాయణ ఎన్నికల ఖర్చంతా శ్రీభరత్ తో పెట్టించారు: విజయసాయిరెడ్డి

  • విశాఖలో గెలుపు ఫ్యాన్ అభ్యర్థిదే
  • టీడీపీ కుయుక్తులు వర్కౌట్ కాలేదు
  • ఖర్చంతా శ్రీభరత్ తో పెట్టించారు
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తారు. విశాఖ లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ ఘనవిజయం సాధించబోతున్నాడంటూ జోస్యం చెప్పారు. సత్యనారాయణ ఓటమికి టీడీపీ అధినాయకత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందని, అయినా ఫలితం లేకపోయిందని ఎద్దేవా చేశారు.

విశాఖ లోక్ సభ స్థానానికి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, పార్టీ క్యాడర్ ను మాత్రం జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణకి ప్రచారం చేయాలంటూ ఆదేశించారని చంద్రబాబుపై ఆరోపణ చేశారు. అంతేకాకుండా, లక్ష్మీనారాయణ ఎన్నికల ఖర్చంతా శ్రీభరత్ తోనే పెట్టించారని, అయినా వాళ్ల ఆటలు సాగలేదని విజయసాయి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy

More Telugu News