SP Rajasekhar Babu: గాయపడిన వారిని పరామర్శించేందుకు రాజకీయ నేతలు వెళ్లొద్దు: గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు

  • వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు
  • గాయాలపాలైన ఇరు పార్టీల కార్యకర్తలు
  • ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని సత్తెనపల్లి, నర్సరావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల పరిధిలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ దాడుల్లో ఇరు పార్టీల కార్యకర్తలు గాయాల పాలయ్యారు. అయితే వారిని పరామర్శించేందుకు రాజకీయ పార్టీల నేతలు వెళ్లొద్దని నేడు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

పరామర్శలకు వెళ్లినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందని, మళ్లీ అలాంటి పరిస్థితులు రాకూడదనే నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. అన్ని పార్టీల నేతలూ ఈ విషయంలో సహకరించాలని కోరారు. అలా కాదని శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు.
SP Rajasekhar Babu
Guntur
Sathenapalli
Narasaraopet
Macharla
Gurajala

More Telugu News