Andhra Pradesh: చంద్రబాబుకు అదృష్టం సుడి తిరిగినట్టు తిరిగింది: జేసీ దివాకర్ రెడ్డి

  • రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ వేవ్ మహిళల్లో ఉంది
  • అందుకే అర్ధరాత్రి దాకా ఓట్లు వేశారు
  • ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరపురాని సన్నివేశం
నిన్న ఓట్లు వేసేందుకు మహిళలు, వృద్ధులు విరగబడి వచ్చారని, చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలపడానికే వాళ్లు వచ్చారని అభిప్రాయపడ్డారు. ఈరోజు విలేకరులతో జేసీ ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అనంతపురం టౌన్, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం రాసి పెట్టుకోండి. మే 23వ తేదీన చూడండి. చంద్రబాబుకు అదృష్టం సుడి తిరిగినట్టు తిరిగింది’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.

నిన్న ఆయా పోలింగ్ బూత్ లలో మొరాయించిన ఈవీఎంలు మధ్యాహ్నానికే పనిచేశాయని, సహజంగా క్యూలో ఉండే మహిళలు ఒక్కసారి ఇంటికి వెళ్తే తిరిగిరారు కానీ, చంద్రబాబు పిలుపుతో ఆయనకు కృతఙ్ఞతతోనే మళ్లీ వచ్చి ఓటేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ వేవ్ మహిళల్లో ఉందని, అందుకే అర్ధరాత్రి దాకా ఓట్లు వేశారని, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరపురాని సన్నివేశం అనీ అభివర్ణించారు. ఈ వేవ్ లో 5 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం గెలుపే కాదని అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
mp
jc

More Telugu News