Nara Lokesh: నా రాష్ట్ర ప్రజలు తెలివైనవారు: నారా లోకేశ్

  • సరైన అభ్యర్థుల పక్షానే నిలిచుంటారు
  • మహిళలు, వృద్ధులంతా చంద్రబాబువైపే
  • ఆప్యాయత చూపారన్న లోకేశ్
ఏపీ ప్రజలు చాలా తెలివైన వారని, వారు సరైన అభ్యర్థుల పక్షానే నిలిచారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు. "తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్క పౌరుడికీ నా హృదయపూర్వక కృతజ్ఞతులు. ఈ ఎన్నికలు మంచికి, చెడుకు మధ్య జరిగాయి. ప్రజలు సరైన పక్షానే నిలబడివుంటారని కచ్చితంగా గెప్పగలను" అన్నారు.

 ఆ తరువాత, "మహిళలకు, వయో వృద్ధులకు కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు రావడం లేదు. ఎండను ఎదిరించి, ఈవీఎంలు మొరాయించినా వెనుదిరగకుండా క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి చూసి వారు ఓట్లేశారు. వారంతా తమ నేత చంద్రబాబు వెనుక ఉన్నారు. తన సొంత కుటుంబాలపై చూపే ఆప్యాయతనే వారు చంద్రబాబుపై చూపారు. హ్యాట్సాఫ్" అని అన్నారు.



Nara Lokesh
Andhra Pradesh
Chandrababu
Twitter

More Telugu News