Telangana: పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించిన తెలంగాణ!

  • రేపటి నుంచి సెలవులు
  • మే 31 వరకూ కొనసాగింపు
  • స్కూళ్లు నడిపితే కఠిన చర్యలన్న విద్యాశాఖ
తెలంగాణ విద్యా శాఖ వేసవి సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకూ రేపటి నుంచి మే 31 వరకూ సెలవులని పేర్కొంది. ఈ 50 రోజులూ అన్ని స్కూళ్లనూ విధిగా మూసివేయాలని ఆదేశించింది. ఇంటర్ లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల పేరిట ఎవరైనా స్కూళ్లు నిర్వహిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, పలు ప్రముఖ విద్యా సంస్థలు ఇంటర్ ప్రవేశం కోరుతున్న విద్యార్థులకు ముందుగానే క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.
Telangana
Holidays
Summer

More Telugu News