Vijay Sai Reddy: ఏపీలో సువర్ణాధ్యాయం... జగన్ వెంటే జన సునామీ: విజయసాయి రెడ్డి

  • ప్రజాస్వామ్యాన్ని ప్రజలే రక్షించుకున్నారు
  • ప్రజల చొరవకు వందనం
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో సువర్ణాధ్యాయం మొదలైందని, జగన్ వెంట జన సునామీ నిలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "టీడీపీ గూండాల దౌర్జన్యాలు, కులమీడియా బెదరగొట్టే వార్తలను పట్టించుకోకుండా జన సునామీ జగన్ గారి వెంట నిలిచింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు, రాక్షస పాలనను అంతం చేసేందుకు ప్రజానీకం చూపిన చొరవకు శిరసు వంచి వందనం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో సువర్ణాధ్యాయం మొదలైంది" అని అన్నారు.

ఆ తరువాత "నియంతలు పాలించిన దేశాల్లో కూడా ఎన్నికల్లో ఇన్ని అరాచకాలు జరిగి ఉండవు. వేల కోట్లు వెద జల్లాడు. తమిళనాడు మద్యం అంతా ఆంధ్రాకి దారి మళ్లించాడు. వైఎస్సార్ సానుభూతి పరుల ఇళ్లకు మంచి నీళ్లు వెళ్లకుండా పైపులైన్లను ధ్వంసం చేశారు. అయినా ప్రజా ప్రభంజనాన్ని అడ్డుకోలేక పోయావు చంద్రబాబు" అని అన్నారు.





Vijay Sai Reddy
Elections
Twitter
Jagan

More Telugu News