Nani: కొన్ని హాట్ సీన్స్, మరింత సెంటిమెంట్, కెరీర్ కోసం తపన... అన్నీ కలగలిసిన నాని 'జెర్సీ' ట్రయిలర్!

  • విడుదలైన 'జెర్సీ' ట్రయిలర్
  • క్రికెట్ లో ఎదగాలన్న యువకుడి ప్రయత్నం
  • అన్ని రకాల అంశాలతో సినిమా
క్రికెట్ లో ఎదగాలని భావించే ఓ యువఆటగాడు పడే తపన, ఆపై పదేళ్ల పాటు క్రికెట్ కు దూరమై, తిరిగి జట్టులోకి వచ్చేందుకు పడిన శ్రమను చూపుతూ నాని హీరోగా నటించిన 'జెర్సీ' ట్రయిలర్ వచ్చేసింది. యుక్త వయసులో ఆటలో అదరగొడుతుంటే, ఆకర్షణలో పడ్డ అమ్మాయితో హాట్ సీన్స్ కూ ఈ చిత్రంలో కొదవలేదని ట్రయిలర్ చెప్పేసింది. కుమారుడు పుట్టిన తరువాత, సరైన సంపాదన లేక హీరో పడే అవస్థలు, డబ్బు కోసం భార్యను అడిగి కాదనిపించుకోవడం, ఆపై భార్య పర్సులోనే దొంగతనం చేయాలని చూడటం వంటి సెంటిమెంట్ సీన్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద 'జెర్సీ'లో అందరికీ కావాల్సిన అంశాలున్నాయని ట్రయిలర్ చెబుతోంది. నాని డైలాగులు కూడా అలరిస్తున్నాయి. ఈ ట్రయిలర్ ను మీరూ చూడండి.
Nani
Jersey
Trailer

More Telugu News