Vizag: గాజువాకలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం: టీడీపీ అభ్యర్థి పల్లా

  • అందరినీ ఆకర్షించిన గాజువాక
  • పవన్ రాకతో ముక్కోణపు పోటీ
  • టీడీపీ పథకాలు గెలిపిస్తాయన్న పల్లా
ఏపీ ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేయడమే ఇందుకు కారణం. పవన్ బరిలోకి దిగడంతో, ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగింది. పవన్ గెలుపు ఖాయమేనని తొలుత నుంచి ప్రచారం జరిగింది కూడా. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ పడగా, విజయంపై ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ అందించిన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిని పొందినవారు భారీ ఎత్తున ఓటు వేసేందుకు వచ్చారని, అందువల్ల తన విజయం ఖాయమని టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. తనకు సౌమ్యుడన్న పేరుందని, కష్టపడి పనిచేసిన తనకే ప్రజలు ఓట్లు వేశారని, పవన్ ఓటమి ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.  
Vizag
Palla
Pawan Kalyan
Elections

More Telugu News