Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అర్థం చేసుకోవాలంటున్న తమన్నా
  • బన్నీ సినిమాకి మ్యూజిక్ కంపోజిషన్ 
  • నాగశౌర్య చిత్రం ఆగిపోయిందట!
*  'హీరోతో సమానంగా హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉండాలంటే అది ప్రతిసారీ కుదిరే పనికాదు' అంటోంది అందాలతార తమన్నా. 'ఒక్కోసారి హీరోయిన్ కి కూడా మంచి క్యారెక్టర్లు పడతాయి. అయితే ప్రతిసారీ హీరో పాత్రతో సమానంగా హీరోయిన్ పాత్ర పడదు. ఇవి కమర్షియల్ సినిమాలు, కొన్ని సూత్రాలు వుంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి' అని చెప్పింది తమన్నా.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే చిత్రం కోసం మ్యూజిక్ సిటింగ్స్ మొదలయ్యాయి. సంగీత దర్శకుడు తమన్ సారథ్యంలో కంపోజిషన్ జరుగుతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ చిత్రానికి గీతాలు రాస్తున్నారు.
*  యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడుగా నూతన దర్శకుడు రాజు కొలుసు దర్శకత్వంలో ఆమధ్య ఓ చిత్రం ప్రారంభమైంది. సగానికి పైగా షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే, అవుట్ పుట్ సరిగా రావడం లేదన్న ఉద్దేశంతో, చిత్ర నిర్మాణాన్ని ఆపేస్తున్నట్టు నిర్మాత భవ్య ఆనంద ప్రసాద్ ప్రకటించినట్టు సమాచారం. 
Thamanna
Allu Arjun
trivikram
nagashourya

More Telugu News