YSRCP: దేవుడి దయ, ప్రజల దీవెనలతో వైసీపీకి విజయం తథ్యం: వైఎస్ జగన్

  • పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు
  • ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం
  • రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమ గీతం పాడారు
దేవుడి దయ, ప్రజల దీవెనలతో వైసీపీకి విజయం తథ్యం అని ఆ పార్టీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం స్థాయిని దిగజార్చుతూ ఈసీని చంద్రబాబు బెదిరించారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన కుట్రలు, డ్రామాలు అన్నింటినీ దాటుకుని ఓటు వేసిన ప్రజలకు కృతఙ్ఞతలు  చెబుతున్నానని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్ లో పాల్గొనడం తమకు అనుకూలమని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని, రాష్ట్రంలో రాక్షస పాలనకు ప్రజలు చరమ గీతం పాడారని  అన్నారు.  
YSRCP
jagan
Telugudesam
Chandrababu
Hyderabad

More Telugu News