Nara Lokesh: తాడేపల్లి క్రిస్టియన్ పేట పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత... ధర్నాకు దిగిన నారా లోకేశ్

  • లోకేశ్ ను చూసి వైసీపీ కార్యకర్తల నినాదాలు
  • వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు
  • పోటాపోటీగా నినాదాలు
రాష్ట్రంలో పోలింగ్ గడువు సాయంత్రం 6 గంటలకే ముగిసినా క్యూలో ఉన్నవారి కోసం ఓటింగ్ కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి క్రిస్టియన్ పేట పోలింగ్ కేంద్రం వద్ద ఓటింగ్ జరుగుతుండగా ఏపీ మంత్రి, టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ అక్కడికి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నారా లోకేశ్ ను చూడగానే అక్కడున్న వైసీపీ కార్యకర్తలు పెద్దపెట్టున వ్యతిరేక నినాదాలు చేశారు. లోకేశ్ రావడంతో ఉత్సాహం రెట్టింపైన టీడీపీ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ వాడీవేడి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ అక్కడ ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News