karthikeya: నటుడిగా నాదైన ముద్ర కనిపించాలి: 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ

  • విభిన్నమైన పాత్రలను చేయాలి
  • నటుడిగా నిరూపించుకోవాలి 
  • క్రేజ్ ను నిలబెట్టుకోవాలి    
తెలుగు తెరకి 'ఆర్ ఎక్స్ 100' సినిమా ద్వారా పరిచయమైన కార్తికేయ, యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన 'హిప్పీ' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజా ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ .. 'ఆర్ ఎక్స్ 100' సినిమా నాకు మంచి క్రేజ్ తెచ్చింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ నాకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు .. ఆ స్థాయి హిట్లు సాధించవలసిన బాధ్యతను పెంచింది.

 అదే సమయంలో నటుడిగా మంచి పేరు తెచ్చుకోవలసిన అవసరం వుంది. రొటీన్ గా పదిమందితో ఫైట్ చేసే హీరోగా మాత్రమే నేను కనిపించదలచుకోలేదు. హీరోగా నేను చేసే పాత్రలపై నాదైన ముద్ర వేయాలనే పట్టుదలతో వున్నాను. ఆ తరహా పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాను. ఇక ప్రయోగాత్మకమైన పాత్రలను చేయడానికి కూడా వెనుకాడను. నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నేను విలన్ గా చేస్తుండటానికి కూడా కారణమదే. కొత్తదనానికీ .. వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూనే నా కెరియర్ సాగుతుంది" అని చెప్పుకొచ్చాడు.
karthikeya

More Telugu News