Vijay Sai Reddy: టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి

  • హింసకు కుట్రలు పన్నుతున్నారు
  • చంద్రబాబు ఈసీనే బెదిరించేందుకు ప్రయత్నించారు
  • అల్లర్లు సృష్టించి వైసీపీపై నెడుతున్నారు
పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే టీడీపీ నేతలు హింసాత్మక సంఘటనలతో ఓటర్లను హడలెత్తించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు కుట్రలు పన్నుతున్న టీడీపీ నేతలు ఆ నిందలను వైసీపీ నేతలపై మోపుతున్నారని తెలిపారు.

వేటకొడవళ్లతో దాడులకు పాల్పడుతోంది టీడీపీ నేతలే అని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు సైతం ఎన్నికల అధికారులను బెదిరించే విధంగా మాట్లాడారని, ఆయనపైనా చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కడప జిల్లాలో సైతం కొందరు పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని అన్నారు.
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News