Sonia Gandhi: అనాడు వాజ్ పేయి గురించి ఇలాగే చెప్పారు... ఈ మోదీ అంతకన్నా గొప్పవాడా?: సోనియా గాంధీ

  • 2004లో ఏం జరిగిందో మర్చిపోవద్దు
  • అప్పుడు కూడా మేమే గెలిచాం
  • మోదీ అజేయుడు కాదు
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మీడియా తనను అడిగిన కొన్ని ప్రశ్నలకు సోనియా గాంధీ బదులిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేశారు. మోదీని ఓటమి ఎరుగని నేతగా తాము భావించడంలేదని అన్నారు.

2004 ఎన్నికల సందర్భంగా వాజ్ పేయి గురించి కూడా ఇలాగే అనుకున్నారని, కానీ, తాము ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని గుర్తుచేశారు. ఇప్పుడు మోదీ అంతకంటే గొప్పవాడేమీ కాదని, ఈ ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. కాగా, నామినేషన్ కు ముందు సోనియా తన కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Sonia Gandhi
Rahul Gandhi
Congress
Narendra Modi

More Telugu News