Andhra Pradesh: పోలీస్ స్టేషన్ లో జేసీ దివాకర్ రెడ్డి తీరుపై వైసీపీ నేతల మండిపాటు!

  • ముందస్తు చర్యల్లో భాగంగా వైసీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి అరెస్టు
  • ఈరోజు తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • అక్కడికి వెళ్లి పోలీసుల ముందే ప్రతాప్ రెడ్డిపై దూషణ
అనంతపురం జిల్లా యల్లనూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారు జామున వైసీపీ నాయకుడు భోగాతి ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో కూర్చున్న జేసీ పోలీసుల ముందే ప్రతాప్ రెడ్డిపై, ఆయన అనుచరులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తున్న పోలీసులు మౌనంగా ఉన్నారని, జేసీని అక్కడి నుంచి బయటకు పంపించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
Andhra Pradesh
Anantapur District
Telugudesam
JC

More Telugu News