Narendra Modi: వీళ్ల ఆటలు సాగవనే నన్ను ఓడించాలని చూస్తున్నారు: విపక్షాలపై మోదీ ధ్వజం

  • ఈ ఐదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి
  • అవినీతికి అడ్డుకట్ట వేస్తా
  • వారసత్వ రాజకీయాలు సాగనివ్వను
దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తానంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రధాని మండిపడ్డారు. "మోదీ మరోసారి గెలిస్తే వాళ్ల అవినీతికి ముగింపు వస్తుంది, వారసత్వ రాజకీయాలు సాగనివ్వను, నేను మళ్లీ గెలిస్తే వీళ్ల ఆటలు సాగనివ్వననే నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు" అంటూ మోదీ విమర్శించారు.

ఈ ఐదేళ్ల కాలంలో దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు. తమ పాలన సందర్భంగా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ కల్పించామని, కానీ మహా కల్తీ కూటమి సైన్యం ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లోని భాగల్ పూర్ సభలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi

More Telugu News