Chandrababu: వైసీపీ ఇష్టానికి రెచ్చిపోతుంటే చూస్తూ ఉన్న ఈసీ, పోలీసులు: చంద్రబాబునాయుడు ఫైర్

  • గూండాయిజం, ఫ్యాక్షన్ గొడవలు చేస్తున్నారు
  • టీడీపీ నేతను హత్య చేసినా పట్టించుకోని పోలీసులు
  • టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారం దౌర్జన్యాలకు దిగుతుంటే, ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గూండాయిజం చేస్తూ, ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు చేసి హత్యలకు పాల్పడుతున్నా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని, సభాపతిపైనా దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నేత సిద్దా భాస్కరరెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సాయంత్రంలోగా వైసీపీ మరింతగా తెగిస్తుందని, తెలుగుదేశం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, వారి అరాచకాలను ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
Chandrababu
EC
Police
Elections
YSRCP
Telugudesam

More Telugu News