junior ntr: భార్య, తల్లితో కలసి వచ్చి ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్

  • జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ లో ఓటు వేసిని తారక్
  • రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అంటూ వ్యాఖ్య
  • ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ విన్నపం
హైదరాబాదులో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్ లకు వస్తున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తన భార్య లక్ష్మీప్రణతి, తల్లి షాలినితో కలసి జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ కు తారక్ వచ్చాడు. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం ఓటు వేశానంటూ సిరా గుర్తు ఉన్న వేలిని చూపించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
junior ntr
vote
tollywood

More Telugu News