Uttar Pradesh: ఓటరు దేవునికి సాదర స్వాగతం...కేంద్రానికి వచ్చిన వారిపై సిబ్బంది పూలవర్షం

  • మేళతాళాలతో ఆహ్వానం
  • ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్‌ సిబ్బంది వినూత్న ఆలోచన
  •  బాఘ్‌పట్  లోక్‌సభ నియోజవర్గంలోని బారౌత్‌లో ఘటన
ఎన్నికల వేళ ఓటరు దేవుడే సుప్రీం. ఓటును సద్వినియోగం చేసినప్పుడే మంచి పాలకులు వస్తారు. ఓటర్ల ప్రాధాన్యం తెలిపేందుకు ఎన్నికల సిబ్బంది వినూత్న ఆలోచన చేశారు. పోలింగ్‌ కేంద్రానికి తరలివచ్చే వారికి మేళతాళాలతో స్వాగతం పలికి వారిపై పూలవర్షం కురిపించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వాగతం పలికారు.

ఉత్తరప్రదేశ్‌ లోని బాఘ్‌పట్ లోక్‌సభ నియోజవర్గం పరిధిలోని బారౌత్‌ పోలింగ్ కేంద్రం సిబ్బంది ఈ చర్య తీసుకున్నారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసేందుకు తామీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్‌ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే.
Uttar Pradesh
baghpath loksabha
welcome to voters

More Telugu News