Guntur District: తాడికొండ నియోజకవర్గంలో 55 చోట్ల ఈవీఎంల మొరాయింపు...ప్రారంభంకాని పోలింగ్‌

  • సాంకేతిక సమస్య అంటున్న ఎన్నికల సిబ్బంది
  • అసహనం వ్యక్తం చేస్తున్న ఓటర్లు
  • సీఈఓకు ఫోన్‌చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే ఆరోపణ
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఈవీఎంలు మొరాయించడంతో చాలాచోట్ల 9.30 గంటల వరకు పోలింగ్‌ ప్రారంభంకాలేదు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్న ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 55 చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం అందింది. ఈవీఎంలు పనిచేయని కారణంగా పోలింగ్‌ ప్రారంభించలేదని అధికారులే వెల్లడించారు. సమస్యను సాంకేతిక సిబ్బందికి తెలియజేశామని వివరణ ఇచ్చారు. ఈ సమస్యపై తాడికొండ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు పనిచేయడం లేదన్న విషయం తెలియజేసేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫోన్‌ చేసినా ఆయన స్పందించలేదని ఆరోపించారు.

Guntur District
tadikonda
EVMs
technical problem

More Telugu News