Chittoor District: చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం

  • అర్ధరాత్రి ఒంటిగంట దాటాక ప్రమాదం
  • కాలిబూడిదైన ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, ఫ్యాన్లు
  • షార్ట్ సర్క్యూటే కారణం
చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతమే దీనికి కారణమని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ నుంచే పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు వివేకానంద భవన్‌లోని రెండో అంతస్తులో ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తోపాటు 112ల్యాప్‌టాప్‌లతో సర్వం సిద్ధం చేశారు.

 ఇదే గదిలో పది వరకు ఏసీలు, 30 వరకు ఫ్యాన్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచారు. అగ్నిప్రమాదంలో ఇవన్నీ కాలి బూడిదయ్యాయి. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అక్కడికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
Chittoor District
collectorate
short circuit
Fire Accident
Andhra Pradesh

More Telugu News