Srikakulam District: ఎన్నికలను శుభకార్యంగా భావిస్తూ ఆహ్వాన పత్రిక రూపొందించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్

  • పోలింగ్ ను దిగ్విజయం చేయాలి
  • శుభకార్యంలో ఓటర్లందరూ పాల్గొనాలి
  • మై వోట్ క్యూ యాప్ వినియోగించుకోవాలంటూ సూచన
ఏపీలో పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఓటర్లలో చైతన్యం పెంపొందించే దిశగా ఆయన ఎన్నికల ఆహ్వాన పత్రికను రూపొందించారు. పోలింగ్ ను ఓ శుభకార్యంలా భావిస్తూ, అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటూ ఆ ఇన్విటేషన్ కార్డులో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎన్నికల శుభకార్య ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.

ఏప్రిల్ 11 గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శుభముహూర్తం అని, ఈ శుభకార్యంలో ఓటర్లు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా, మై వోట్ క్యూ అనే యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించారు.
Srikakulam District

More Telugu News