Andhra Pradesh: టీడీపీ తరపున పోలీసులే డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

  • సత్తెనపల్లిలో ఇలా జరుగుతోందని ఆరోపణ 
  • టీడీపీ దురాగతాలకు అడ్డుకట్ట వేయాలి
  • ఈసీనీ కలిసిన వారిలో కన్నా, జీవీఎల్
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరపున పోలీసులే డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదికి బీజేపీ నేతలు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఈసీనీ కలిసిన వారిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు ఉన్నారు. టీడీపీ దురాగతాలకు అడ్డుకట్ట వేయాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. 
Andhra Pradesh
sattenapalli
bjp
gvl
EC

More Telugu News