East Godavari District: పెద్దాపురంలో వైసీపీ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన

  • పోలింగ్‌కు పూర్తైన ఏర్పాట్లు
  • ఏరులై పారుతున్న డబ్బు, మద్యం
  • డబ్బులివ్వడం లేదని మహిళల ఆగ్రహం
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ఏపీ సిద్ధమైంది. పోలింగ్‌కు కొన్ని గంటలే సమయం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసేశారు. ప్రచార పర్వం నిన్న సాయంత్రంతో ముగిసింది. ప్రస్తుతం ప్రలోభాల పర్వం నడుస్తోంది. అన్ని జిల్లాల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతున్నాయి. అయితే తమకు డబ్బులిస్తామని తీసుకు వచ్చి, డబ్బులివ్వడం లేదంటూ కొందరు మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వైసీపీ కార్యాలయం వద్ద సదరు మహిళలు ఆందోళనకు దిగారు.
East Godavari District
Peddapuram
Polling
YSRCP

More Telugu News