Rahul Gandhi: కార్యకర్తల కోలాహలం మధ్య అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్

  • కిక్కిరిసిపోయిన అమేథీ వీధులు
  • ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్లిన రాహుల్
  • భర్త, పిల్లలతో హాజరైన ప్రియాంకా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తల కోలాహలం మధ్య రాహుల్ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అమేథి నగర వీధులు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలతో కిక్కిరిసి పోయాయి. రాహుల్‌కు పూలు చల్లుతూ ప్రజలు అభినందనలు తెలిపారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాతో పాటు వీరి పిల్లలు రైహాన్, మిరాయా పాల్గొన్నారు.
Rahul Gandhi
Uttar Pradesh
Sonia Gandhi
Priyanka Gandhi
Robert Vadra

More Telugu News