Supreme Court: సుప్రీంకోర్టు స్పందన చాలా సంతోషాన్నిచ్చింది: రాహుల్ గాంధీ

  • రాఫెల్ డీల్ పై సుప్రీం స్పందనను స్వాగతిస్తున్నాం
  • కాపలాదారుడే దొంగ అని సుప్రీం చెప్పినట్టైంది
  • రాఫెల్ అసలు నిజాలను దేశం తెలుసుకోవాలనుకుంటోంది
దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన రాఫెల్ యుద్ధ విమానాల డీల్ అంశంపై వేసిన రిట్ పిటిషన్లపై విచారణ జరుపుతామని ఈరోజు సుప్రీంకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. విచారణ తేదీలను త్వరలోనే తెలుపుతామని చెప్పింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, సుప్రీంకోర్టు నిర్ణయం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. రాఫెల్ ఒప్పందం ద్వారా అనిల్ అంబానీకి వేల కోట్ల రూపాయలను మోదీ దోచిపెట్టారని విమర్శించారు. కాపలాదారుడే దొంగ అని సుప్రీం చెప్పినట్టైందని అన్నారు. ఈ విషయంపై మోదీతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాఫెల్ డీల్ వెనుక ఉన్న అసలైన నిజాలను తెలుసుకోవాలని దేశం మొత్తం ఎదురుచూస్తోందని చెప్పారు.
Supreme Court
rahul gandhi
rafale
modi
bjp
congress

More Telugu News