Andhra Pradesh: నాకు, మా అమ్మకు ఇంకా ఓటర్ స్లిప్పులు అందలేదు!: నటి రష్మీ

  • మాకు వైజాగ్ లో శాశ్వత నివాసం, ఓటర్ ఐడీ ఉన్నాయి
  • అయినా ఇంతవరకూ స్లిప్పులు అందలేదు
  • ఈరోజు సాయంత్రం వరకూ వేచిచూస్తాం
తనతో పాటు తన తల్లికి ఇంకా ఓటర్ స్లిప్పులు అందలేదని బుల్లితెర యాంకర్, నటి రష్మీ తెలిపింది. తనకు వైజాగ్ లో ఓటర్ ఐడీ ఉందనీ, అక్కడే శాశ్వత నివాసం కూడా ఉందని చెప్పింది. తమతో పాటు మొత్తం బిల్డింగ్ లో ఎవ్వరికీ ఓటర్ స్లిప్పులు అందని విషయం నిన్న సాయంత్రం వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. దీంతో ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని అధికారులను వాళ్లు హెచ్చరించారని రష్మీ చెప్పింది. ఓటర్ స్లిప్పుల కోసం తాను ఈరోజు సాయంత్రం వరకూ వేచిచూస్తానని రష్మీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో స్పందించింది.
Andhra Pradesh
Visakhapatnam District
elections
rashmi
actress

More Telugu News