women: యూపీలో మహిళా పోలీసును చితకబాదిన ముగ్గురు మహిళలు.. అరెస్ట్

  • ఉత్తరప్రదేశ్ సీతాపూర్ లో ఘటన
  • క్యూలైన్ దాటిన మహిళలను అడ్డుకున్న మహిళా పోలీస్
  • దాడి చేసి, తీవ్రంగా కొట్టిన మహిళలు
ఓ మహిళా పోలీసును ముగ్గురు మహిళలు చితకబాదిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సీతాపూర్ పట్టణంలోని స్థానిక ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... మహిళా పోలీసు రీతా కుమారి నిన్న ఆసుపత్రి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో కొందరు మహిళలు క్యూలైన్ దాటుకుని వెళ్లేందుకు యత్నించారు. వారిని అడ్డుకునేందుకు రీతా కుమారి యత్నించడంతో... ఆమెపై వారు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.
women
police
beate
Uttar Pradesh

More Telugu News