rajanikanth: రజనీ 'దర్బార్' షూటింగ్ మొదలైపోయింది

  • రజనీ కథానాయకుడిగా 'దర్బార్'
  • పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్
  • రెగ్యులర్ షూటింగుకి సన్నాహాలు        
వరుస సినిమాలతో రజనీకాంత్ యువ కథానాయకులతో పోటీపడుతూ దూసుకుపోతున్నారు. 'కబాలి' .. 'కాలా' .. 'పేటా' సినిమాలు రజనీని మరింత స్టైల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి. ఆయన తాజా చిత్రం మురుగదాస్ తో వుంది. 'సర్కార్' తరువాత సినిమాను మురుగదాస్ .. రజనీతో ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాకి 'దర్బార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ముంబైలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగుకి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం అధికారికంగా బయటికి వచ్చింది. ఇక మరో పాత్రలో ఆయన సామాజిక సేవకుడిగా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. రజనీ సరసన నాయికగా నయనతార కనిపించనుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.
rajanikanth
nayanatara

More Telugu News