Guntur District: గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐపై బదిలీ వేటు!

  • ఎన్నికల తరుణంలో ఏపీలో ఆసక్తికర పరిణామాలు
  • సీఐ శ్రీనివాసరావును బదిలీ చేసిన ఈసీ
  • కొత్త సీఐగా సురేశ్ కుమార్ నియామకం
ఏపీలో ఎన్నికల తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో మరో పోలీసు అధికారిని ఈసీ బదిలీ చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐ శ్రీనివాసరావును బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే శ్రీనివాసరావును ఈసీ బదిలీ చేసింది. సీఐ శ్రీనివాసరావు స్థానంలో సురేశ్ కుమార్ ను నియమించింది.
Guntur District
Tadepalli
CI
Srinivasa rao

More Telugu News