Dasoju Sravan: టీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి బ్యాంకులను ముంచారు.. తలసాని కుమారుడు భూ కబ్జాకోరు: దాసోజు శ్రవణ్

  • మల్కాజ్‌గిరి అభ్యర్థి ఫీజుల దొంగ
  • నల్గొండ అభ్యర్థి భూ కబ్జాకోరు
  • టీఆర్ఎస్‌కు ఓటేస్తే మురిగిన కోడిగుడ్డే
ధనబలం ఉందనే టీఆర్ఎస్ పార్టీ వ్యాపారస్థులను పోటీలో నిలబెట్టిందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్‌కు ఓటేస్తే మురిగిపోయిన కోడిగుడ్డు అవుతుందని ఎద్దేవా చేశారు. ఓటు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే ఆయుధమని, విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సోనియాకు ధన్యవాదాలు తెలపాలని శ్రవణ్ సూచించారు. ప్రజాసేవ చేసే అభ్యర్థులు కావాలో, వ్యక్తిగత వ్యాపారాలే లక్ష్యంగా పార్లమెంటులో పైరవీలు చేసే టీఆర్ఎస్ అభ్యర్థులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు. టీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి బ్యాంకులను ముంచారని, నల్గొండ అభ్యర్థి భూ కబ్జాకోరని, తలసాని కుమారుడు భూ కబ్జాకోరని, మల్కాజ్‌గిరి అభ్యర్థి ఫీజుల దొంగ అని శ్రవణ్ ఆరోపించారు.
Dasoju Sravan
Sonia Gandhi
TRS
Congress
Talasani
Malkajgiri
Khammam

More Telugu News