Andhra Pradesh: ఏపీలో ముగిసిన ఎన్నికల ప్రచారం

  • ఈరోజు సాయంత్రం ఆరు గంటలతో ముగిసిన ప్రచారం
  • హోరాహోరీగా ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం
  • ఎల్లుండి ఉదయం పోలింగ్
ఏపీలో జోరుగా సాగిన ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. 21 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు అన్ని పార్టీలు తమ ప్రచారానికి తెరదింపాయి. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు చివరి రోజు ప్రచారం హోరాహోరీగా నిర్వహించాయి.

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఆరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కురుపాం, పార్వతీపురం, సాలూరులో ఉదయం 7  నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
 
Andhra Pradesh
Telangana
Election
campaing

More Telugu News