YSRCP: చెప్పులు లేకుండా తిరుమల కొండకు కాలినడకన వెళ్లా .. చంద్రబాబు పార్టనరే బూట్లతో వెళ్లారు: పవన్ కు వైఎస్ జగన్ కౌంటర్

  • తిరుమల కొండపైకి చెప్పులతో వెళ్లానన్నది దుష్ప్రచారం
  • చెప్పుల్లేకుండా 3200 మెట్లు కాలినడకన ఎక్కాను 
  • చంద్రబాబు పార్టనరే బూట్లు వేసుకుని కొండపైకి వెళ్లారు
తిరుమల కొండపైకి వైఎస్ జగన్ చెప్పులతో వెళ్లారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పడే పడే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను జగన్ నేడు ఖండించారు. తిరుమలలో నిర్వహించిన చివరి ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ, తిరుమల కొండపైకి తాను చెప్పులు లేకుండా కాలినడకన వెళ్లానని, 3200 మెట్లు ఎక్కానని స్పష్టం చేశారు. చెప్పులతో వెళ్లానంటూ దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.

చంద్రబాబు పార్టనరే బూట్లు వేసుకుని కొండపైకి వెళ్లారని పవన్ పై విమర్శలు చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సమష్టి గా పోరాడాలని, కేసీఆర్ మద్దతు ప్రకటిస్తే కనీసం ఆయనకు టీడీపీ నేతలు కృతఙ్ఞతలు కూడా చెప్పలేదని విమర్శించారు.
YSRCP
jagan
janasena
Pawan Kalyan
tirupathi

More Telugu News