Chandrababu: చివరి వన్ అవర్ గోల్డెన్ అవర్... నేనందరితోనూ మాట్లాడాలి: చంద్రబాబు

  • ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి
  • ఆఖరి రోడ్ షోలో సీఎం భావోద్వేగం
  • తాడికొండలో జనసంద్రం
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఆఖరి రోడ్ షో తాడికొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దగా సమయంలేదని, సాయంత్రం ఐదింటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉందని అన్నారు. ఎన్నికల ప్రచారం చరమాంకంలో చివరి వన్ అవర్ గోల్డెన్ అవర్ అని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య సమయంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదే చివరి సభ అని, మీ ఆశీస్సులు కావాలని, మీ అనుమతితో నిశ్చింతగా వెళతానని చెప్పారు. ఇన్నాళ్ల తన పాలనలో ఎవరికీ ఇబ్బందిలేకుండా చేశానని అన్నారు.
Chandrababu
Jagan

More Telugu News