Telugudesam: అసెంబ్లీలో నా ముఖం చూడటం ఇష్టం లేకపోతే, పోయి ఇంట్లో కూర్చోమనండి!: చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్

షార్ట్స్‌లో చూడండి
పవిత్ర దేవాలయం అసెంబ్లీని దెయ్యాల కొంపగా మార్చేసి, పార్టీ మారిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చేశారంటూ టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా పరోక్షంగా విరుచుకుపడ్డారు. నగరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, స్పీకర్ స్థానంలో ఓ ఫ్యాక్షనిస్టుని కూర్చోబెట్టారని, అసెంబ్లీ ముఖం చూడాలనిపించక పోవడానికి కారణం కేవలం చంద్రబాబు ఘనతేనని, ఇలాంటి వ్యక్తి మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదు, ఆ పార్టీ అధికారంలోకి రాకూడదని అన్నారు.

ఇటీవల పుత్తూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. చంద్రబాబునాయుడు దిగజారిపోయారని తెలుసుగానీ, మరీ, ఇంతగా దిగజారిపోయారని అనుకోలేదని విమర్శించారు. "నన్ను ‘అది’ అని ఏకవచనంతో, ఇంకా చాలా గలీజ్ గా మాట్లాడతాడు. అసెంబ్లీలో నా ముఖం చూడటం ఇష్టం లేదంటే, పోయి ఇంట్లో కూర్చోమనండి. అతని పార్టీ ఎలాగూ ఇంట్లో కూర్చుంటుంది. అతన్ని కూడా వెళ్లి ఇంట్లో కూర్చోమనండి" అని రోజా ఆవేశంగా అన్నారు.
Go Back to Shorts
Telugudesam
Chandrababu
YSRCP
Roja
Jagan

More Telugu News