jagan: వైసీపీ బెంబేలెత్తిపోతోంది: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని... ఆ పార్టీ బెంబేలెత్తిపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ నీళ్లు, ఏపీ ఉపాధి, ఏపీ ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ దాడి చేస్తోందని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్, జగన్ లకు నోరు తెరిస్తే... అబద్ధాలే వస్తాయని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాను కేసీఆర్ వ్యతిరేకించారని... ఏపీ ఎన్నికల ముందు జగన్ కోసం ప్రత్యేక హోదా డ్రామాను కేసీఆర్ ఆడుతున్నారని విమర్శించారు. కడుపునిండా కేసీఆర్ ద్వేషాన్ని నింపుకున్నారని అన్నారు.

అవినీతి సొమ్మును వైసీపీ వెదజల్లుతోందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 25 లక్షల ఓట్ల తొలగింపుకు కేసీఆర్ తెగించారని... ఏపీలో కూడా అదే కుట్ర చేద్దామని యత్నించి, జగన్ బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. టీడీపీ సేవామిత్ర యాప్ పై జగన్ కోసమే కేసీఆర్ దాడి చేశారని మండిపడ్డారు. డేటాను దొంగిలించి, వైసీపీకి ఇవ్వడం పెద్ద నేరమని చెప్పారు. దొంగ దెబ్బలు తీయడం దుర్మార్గులకు అలవాటేనని అన్నారు. కేసీఆర్, జగన్ ల ముసుగులు తొలగిపోయాయని చెప్పారు.
Go Back to Shorts
jagan
chandrababu
modi
kcr

More Telugu News