Vijay Sai Reddy: మీరు పీఠం ఎక్కించిన దేవెగౌడే, మన నోట్లో మట్టి కొట్టలేదా?: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబు చక్రం తిప్పి ప్రధాని పదవిని అందించిన దేవెగౌడ, ఏపీ ప్రజల నోట్లో మట్టి కొట్టారని, ఇప్పుడా సంగతిని మరిచి, ఆయన్ను పక్కన పెట్టుకున్న చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆయన, "మీరు చక్రం తిప్పి ప్రధాని పీఠం ఎక్కించిన దేవెగౌడ ఆల్మట్టి ఎత్తు పెంచి కృష్ణా జలాలు దక్కకుండా ఏపీ ప్రజల నోట్లో మన్ను కొట్టారు. అదే దేవేగౌడను పక్కన పెట్టుకుని ‘నేను పోతే పోలవరం గతేమిటం’టూ దొంగ ఏడుపులతో తెగ నటించేస్తున్నారు. జీవనాడి వంటి పోలవరంను ఏటీఎంగా మార్చుకున్న దొంగ మీరు" అని విమర్శలు గుప్పించారు. 
Go Back to Shorts
Vijay Sai Reddy
Deve Gowda
Polavaram
Chandrababu
Krishna
Almatti

More Telugu News