Andhra Pradesh: మనం పెట్టిన పొగ తట్టుకోలేక ఎలుక బయటకు వచ్చింది!: కేసీఆర్ పై చంద్రబాబు సెటైర్లు

  • కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు
  • జగన్ తో లాలూచీని స్వయంగా బయటపెట్టారు
  • అమరావతిలో టీడీపీ నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిజస్వరూపాన్ని తానే బయటపెట్టుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ కుమ్మక్కు రాజకీయాలు, లాలూచీని స్వయంగా కేసీఆరే బయటపెట్టారని వ్యాఖ్యానించారు.‘మనం పెట్టిన పొగ తట్టుకోలేక ఎలుక బయటకు వచ్చింది. తన మనసులో టీడీపీపై  ఉన్న అక్కసు అంతా కేసీఆర్ బయటపెట్టుకున్నాడు’ అని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు ఎలక్షన్ మిషన్-2019పై టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నిజంగా ఏపీ బాగుండాలని కోరుకుంటే కేసీఆర్ రాష్ట్రానికి వ్యతిరేకంగా అఫిడవిట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. గోదావరి నదిపై నాలుగు ప్రాజెక్టులను, కృష్ణా నదిపై 9 ప్రాజెక్టులను కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుకు కేసీఆర్ ఎందుకు వ్యతిరేకమో అడిగితే జవాబు చెప్పడం లేదన్నారు.

జగన్ ను ఓడించి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. దొంగదెబ్బ తీయడం దుర్మార్గుల అలవాటనీ, వైసీపీ అవినీతి సొమ్మును వెదజల్లుతోందని ఆరోపించారు. కడుపు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Jagan
kcr

More Telugu News