Chittoor District: కుప్పంలో కనిపించని వైసీపీ అభ్యర్థి.. ఎక్కడున్నారో తెలియక వైసీపీ నేతల ఆందోళన

  • ప్రచారంలో కనిపించని రాజమౌళి
  • ఆయన కుమారుడితో కలిసి జగన్ రోడ్డు షో
  • తన కోసం కాకుండా తన భర్త కోసం ఓట్లు అభ్యర్థిస్తున్న చంద్రమౌళి భార్య
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో కత్తులు నూరుకుంటుండగా, చిత్తూరు జిల్లా కుప్పం ప్రచారంలో వైసీపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆయన ఎక్కడున్నారో వైసీపీ నేతలకే అంతుబట్టడం లేదు. చంద్రమౌళి తరపున ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ప్రచారంలో కనిపిస్తున్నారు.

ఇటీవల కుప్పంలో జగన్ నిర్వహించిన రోడ్డు షోలోనూ చంద్రమౌళి కనిపించలేదు. దీంతో ఆయన కుమారుడు భరత్‌ను పక్కన నిల్చోబెట్టుకుని జగన్ ప్రచారాన్ని ముగించారు. ప్రచారంలో చంద్రమౌళి ఎక్కడా కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, కుప్పం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చంద్రమౌళి భార్య పద్మజ.. భర్త కోసం ప్రచారం చేస్తుండడం విశేషం. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న ఆమె తనకు కాకుండా తన భర్తకు ఓటు వేయాలని కోరుతున్నారు. అనారోగ్య కారణాల వల్లే చంద్రమౌళి బయటకు రాలేదన్న వార్తలు వినిపిస్తుండగా, చంద్రబాబు వంటి కొండను ఢీకొని గెలవడం సాధ్యం కాదని ముందే ఓటమిని ఒప్పేసుకుని ప్రచారానికి రావడం లేదన్న మరో వాదన వినిపిస్తోంది.
Chittoor District
Kuppam
YSRCP
Chandramouli
Chandrababu
Jagan

More Telugu News