Botsa Satyanarayana: నటుడివైతే సినిమాల్లో చూపించుకోండి, వీధుల్లోకి వచ్చి మా కుర్రాళ్లను కొడితే ఊరుకునేది లేదు: బాలకృష్ణకు బొత్స వార్నింగ్

  • యువకుడికి క్షమాపణ చెప్పాలి
  • ఎవర్నయినా మీ ఇష్టానుసారం కొడతారా?
  • విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం
టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల కాలంలో తరచుగా చేయిచేసుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కూడా ఓ అభిమానిపై చేయిచేసుకున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మీరు సినీ నటులైతే మీ యాక్షన్ ను సినిమాల్లో చూపించుకోండి, అంతేగానీ, వీధుల్లోకి వచ్చి మా ఊరి కుర్రాళ్లను కొడతానంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు అంటూ ఘాటుగా హెచ్చరించారు.

బాధితుడు టీడీపీ కార్యకర్తే అయినా, అతడు చీపురుపల్లి ప్రాంతానికి చెందినవాడని, అందుకే అతడి తరఫున మాట్లాడుతున్నామని బొత్స పేర్కొన్నారు. ఆ కుర్రాడికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మున్ముందు ఇలాంటివి జరిగితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. కనీస విలువలు, వ్యక్తిత్వం లేకుండా ఇలా వీధుల్లోకి వచ్చి కొట్టడం ఏంటని బొత్స నిలదీశారు.
Botsa Satyanarayana
Balakrishna
YSRCP
Telugudesam

More Telugu News