YSRCP: జగన్ కే కాదు చంద్రబాబుకూ ఓటెయ్యకూడదు: కేఏ పాల్

  • ఒక్క క్రైస్తవుడు కూడా జగన్ కు ఓటెయ్యడు
  • జగన్ కు ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్టే
  • ఆత్మను అమ్ముకున్న అవినీతిపరుడు జగన్
ఏపీని అప్పుల నుంచి విడుదల చేసి,  మోదీకి, కేసీఆర్ కు అప్పజెప్పకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ కు ఓటెయ్యకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ కే కాదు చంద్రబాబుకూ ఓటెయ్యకూడదని, జగన్ కు ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్టేనని అభిప్రాయపడ్డారు.

‘జగన్ కు కేసీఆర్ వెయ్యికోట్లు ఎందుకు ఇచ్చాడు? ఆలోచించండి. మూర్ఖుడా? వెయ్యి కోట్లు ఇచ్చాడంటే లక్ష కోట్లు దోచుకోవడానికే. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కేసీఆర్ కు మీరు అధికారం ఇస్తారా? జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, వీహెచ్పీ, మోదీకి ఓటేసినట్టే, తెలివైనవాడెవరూ జగన్ కు ఓటెయ్యరు. ఒక్క శాతం తెలివి తేటలున్నా జగన్ ని పక్కనబెడతారు. ఒక్క క్రైస్తవుడు కూడా జగన్ కు ఓటెయ్యడు. ఓట్ల కోసం ఆత్మను అమ్ముకున్న అవినీతిపరుడు జగన్’ అని విరుచుకుపడ్డారు.
YSRCP
jagan
Telugudesam
Chandrababu
TRS
kcr
prajashanti
party
ka pal
modi
bjp
vhp

More Telugu News