Rahul Gandhi: ఫేస్‌బుక్ ద్వారా కీలక ప్రకటన చేసిన రాహుల్

  • పరీక్ష ఫీజు మాఫీ చేసేలా ఆదేశాలు
  • ‘రైట్ టు హెల్త్’ అనే కొత్త పథకాన్ని తీసుకొస్తా
  • బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థులు, నిరుద్యోగులకు తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని రకాల పరీక్షలకు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. అలాగే ‘రైట్ టు హెల్త్’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి, దానికోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తామని రాహుల్ పోస్టులో పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనుండగా రాహుల్ తాజాగా చేసిన ప్రకటన ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి.
Rahul Gandhi
Facebook
Right to Health
Loksabha

More Telugu News