sj surya: విలన్ గా బిజీ అవుతోన్న స్టార్ డైరెక్టర్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడిగా ఎస్.జె. సూర్య ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఒకానొక సమయంలో ఆయనను వరుస పరాజయాలు వెంటాడాయి. దాంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నటనపై దృష్టిపెట్టాడు. ప్రతినాయకుడి పాత్రల ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలా ప్రతినాయకుడిగా ఆయన చేసిన పాత్రలు జనంలోకి వెళ్లడంతో అదే తరహా పాత్రలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి.

దాంతో మహేశ్ 'స్పైడర్' లోను .. విజయ్ 'మెర్సల్'లోను ప్రతినాయకుడిగా మెప్పించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ కారణంగానే ప్రస్తుతం రజనీతో తాను చేస్తోన్న సినిమాలో ఎస్.జె.సూర్యకి మళ్లీ ప్రతినాయకుడిగా దర్శకుడు మురుగదాస్ అవకాశం ఇచ్చాడు. ఇది గొప్ప అవకాశంగా ఎస్.జె. సూర్య భావిస్తోన్న సమయంలోనే, అజిత్ తాజా చిత్రం నుంచి ఆయనకి ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలోనూ ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగానే కనిపించనున్నాడు. మొత్తానికి ఈ స్టార్ డైరెక్టర్ విలన్ గా ఫుల్ బిజీ అయ్యాడన్న మాట.
Go Back to Shorts
sj surya

More Telugu News