ali: స్నేహమంటే ఇదేనా?.. అలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

  • అలీని వైసీపీ నేతలు వాడుకున్నారు
  • ఎంపీ టికెట్ ఇస్తామంటేనే వైసీపీలో చేరాడు
  • నన్ను బెదిరిస్తే తోలు తీస్తా
వైసీపీ నేత, సినీ నటుడు అలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు అలీకి అండగా ఉన్నానని... తనతో కలసి పని చేస్తానని చెప్పి, తనను వదిలి వైసీపీలోకి వెళ్లాడని అన్నారు. స్నేహమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. అలీలాంటి వాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని అన్నారు.

అవసరంలో ఆదుకున్న అలీనే వదిలేసి వెళ్లిపోతే... ఇంకెవరిని నమ్మాలని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రజలను తప్ప బంధుమిత్రులను నమ్మలేకపోతున్నానని చెప్పారు. అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని... ఎంపీ టికెట్ ఇస్తామంటే వైసీపీలో అలీ చేరాడని చెప్పారు. రాజమండ్రిలో రోడ్ షో లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

తన తండ్రి వైయస్సార్ శవం కూడా దొరక్కముందే సీఎం అయ్యేందుకు జగన్ ప్రయత్నించారని... అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని పవన్ ప్రశ్నించారు. వైయస్ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలని తనను బెదిరించారని... బెదిరిస్తే తోలు తీస్తానని హెచ్చరించానన్నారు. తాను రాజకీయాల్లో రాణించలేనని ఎలా అంటారని... తాను స్టార్ హీరోని అవుతానని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. 
ali
Pawan Kalyan
janasena
ysrcp
jagan

More Telugu News