jagan: నన్ను ఓడించేందుకు కేసీఆర్ రూ.200 కోట్లు పంపారు: నారా లోకేశ్ ఆరోపణ

  • జగన్ జైలు పక్షి.. ఆర్కే కోర్టు పక్షి
  • వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి పేరు కూడా లేదు
  • దొంగ చేతికి తాళాలు ఇస్తామా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తనను ఓడించేందుకు రూ. 200 కోట్లను కేసీఆర్ పంపించారని ఆరోపించారు. ఎవరెన్ని చేసినా... తనను ఎవరూ ఓడించలేరని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ జైలుపక్షి అని... మంగళగిరి వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి కోర్టు పక్షి అని ఎద్దేవా చేశారు. ఉండవల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని లోకేష్ చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి పేరు కూడా లేదని విమర్శించారు. మన రాష్ట్ర తాళాలను ఒక దొంగ చేతికి ఇస్తామా? అని ఆయన ప్రశ్నించారు.
jagan
Nara Lokesh
kcr
mangalagiri
Telugudesam
ysrcp
TRS

More Telugu News