Nara Lokesh: బ్రాహ్మణికి రూ. 500 ఇచ్చిన అవ్వ... వీడియో పోస్ట్ చేసిన లోకేశ్!

  • టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆశీర్వాదం
  • ఎన్నికల ఖర్చు కోసం పెన్షన్ నుంచి డబ్బు
  • ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్న లోకేశ్
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న యువనేత నారా లోకేశ్ కు మద్దతుగా ఆయన భార్య బ్రాహ్మణి ప్రచారం నిర్వహించిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ అవ్వ తనకు వచ్చిన పెన్షన్ నుంచి రూ. 500 బ్రాహ్మణికి అందించి, ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను లోకేశ్, తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. "తెలుగుదేశం పార్టీ విజయంకోసం మంగళగిరిలో నారా బ్రాహ్మణి  ప్రచారం చేస్తుండగా, ఈ అవ్వ మాట్లాడుతూ తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆశీర్వదిస్తూ, ఎన్నికల ఖర్చుల కోసం తన పెన్షన్ నుంచి రూ.500 ఇచ్చింది. అవ్వ ఆశీర్వాదం ఫలిస్తుంది, ప్రజల ఆకాంక్షలు తప్పక నెరవేరతాయి" అని వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Brahmani
Mangalagiri
Campaign

More Telugu News